శ్రీహరికోట : తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)కు బాంబు బెదిరింపు వచ్చింది. షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఆదివారం అర్ధరాత్రి ఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సోమవారం తెల్లవారుజాము నుంచి షార్ పరిసరాల్లో అణువణువూ తనిఖీలు కొనసాగించారు. సీఐఎస్‌ఎఫ్ బృందాలు, పోలీసు బలగాలు పాల్గొన్నాయి. సముద్ర మార్గాల్లోనూ తీరప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలో పోలీసులు పాల్గొన్నారు. తనిఖీల అనంతరం బెదిరింపు ఫోన్‌కాల్ ఆకతాయిలు చేసిన పనిగా భద్రతా బలగాలు తేల్చాయి.