Homeఆంధ్రప్రదేశ్విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

- Advertisement -

విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్లు, వైకాపా నేతలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాపై వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని టీచర్లు ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రీడల మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, శాప్‌ ఛైర్మన్‌, ఎండీకి వినతిపత్రాలు అందజేసేందుకు శాప్‌ కార్యాలయం వద్దకు స్పోర్ట్స్‌ కోటా టీచర్లు వచ్చారు.అదే సమయంలో వైకాపా నేతలు కార్యాలయం బయట బైఠాయించారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో ఇటు టీచర్లు, అటు వైకాపా కార్యకర్తలు నినాదాలు చేశారు. వైకాపా నేతల ఆరోపణలను స్పోర్ట్స్‌ కోటా టీచర్లు తీవ్రంగా ఖండించారు. మరోవైపు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు, వైకాపా నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులను పలువురు వైకాపా నేతలు నెట్టివేశారు. టీచర్లపై వాటర్‌ బాటిళ్లు విసిరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని వైకాపా నేతలను చెదరగొట్టారు. నిరసన తెలుపుతున్న టీచర్ల వద్దకు శాప్‌ ఎండీ భరణి చేరుకుని వారితో మాట్లాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు