టెల్‌అవీవ్ : గాజాలో కాల్పుల వివరణకు త్వరలో ఒప్పందం జరగబోతోందని, అంతకుముందు 60 రోజుల పాటు యుద్ధానికి విరామం ఇచ్చేందుకు ఇజ్రాయిల్ అంగీకరించిందని అమెరికా చెప్పిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ హెచ్చరిక చేశారు. ఇజ్రాయిల్ వెనక్కి తగ్గదని, హమాస్‌ను పూర్తిగా తుడిచిపెడుతుందని ప్రకటించారు. ‘హమాస్ ఉండదు… హమస్థాన్ ఉండదు’ అంటూ ఆయన ఓ కార్యక్రమంలో తెలిపారు. పలస్తీనాను విడిచి వెళ్లిపోవటానికి హమాస్ అంగీకరిస్తేనే 60 రోజుల కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని నెతన్యాహు అన్నారు. ఒకసారి యుద్ధం ముగిసిందంటే గాజాలో హమాస్ కనిపించడానికి వీల్లేదన్నారు. యుద్ధాన్ని ఆపడటం కోసం ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం నేపథ్య కాల్పుల విరమణ ఒప్పందాలను హమాస్ పరిగణనలోకి తీసుకుంటున్నప్పటికీ… యుద్ధం ముగిస్తేనే సంధి అని ఇజ్రాయిల్, అమెరికాకు తేల్చిచెప్పింది. గాజా భూభాగాల నుంచి ఇజ్రాయిల్ దళాలు వెనక్కివెళ్లాలని, అప్పుడే బందీలను విడిచిపెడతామని హమాస్ ప్రతినిధి తాహెర్ అల్ నునూ తెలిపారు. యుద్ధాన్ని ముగిస్తామంటేనే చర్చలకు వస్తామని చెప్పారు. హమాస్ లొంగిపోదని కూడా తేల్చిచెప్పారు.
హమాస్‌ను తుడిచిపెట్టేస్తాం: నెతన్యాహు
RELATED ARTICLES