. ప్రశ్నార్థకంగా నిరుద్యోగ భతి, ఆడబిడ్డ నిధి
. ప్రతి నెలా అప్ప్పుల కోసం దిల్లీవైపు చూపు
. అమలుకు చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ విమర్శనాస్త్రాలు
సూపర్ సిక్‌్స హామీల్లో ప్రధానంగా నిరుద్యోగ భతి, ఆడబిడ్డ పథకం అమలు కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు ఎన్నికల ముందు ఈ రెండు పథకా లను ఆశగా చూపి నిరుద్యోగులు, మహిళల ఓట్లు దండుకుని అధికారం లోకి వచ్చారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షమైన వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. నిరుద్యోగ భతి నెలకు రూ.మూడు వేలు, 18 ఏళ్లు పైబడి 59 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం కింద నెలకు రూ.1,500 చొప్ప్పున ఇవ్వడం అనేది ‘కూటమికి’ కత్తిమీద సాముగా మారింది. ఇవి ఖచ్చితంగా అమలు చేయాలంటే ఖజానా సరిపోదు. అమలౌతున్న పింఛన్‌లు, మూడు ఉచిత సిలెండర్లు, స్త్రీశక్తి, తల్లికివందనం, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుకు ప్రతినెలా దిల్లీ వైపు చూడాల్సి వస్తోంది. నిరుద్యోగ భతి, ఆడబిడ్డ పథకాలు అమలుకు నిధులు సమకూర్చుకోవడం తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి సాధ్యంకాదన్నది ప్రతిపక్షాల ఆలోచన. దీంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రజల్లో పలుచన చేయడానికే వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతోందన్నది స్పష్టమౌతోంది.
విశాలాంధ్ర – సచివాలయం: సూపర్ సిక్‌్స హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం త్వరలో మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోం దన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే సూపర్ సిక్‌్స హామీల్లో అధికశాతం అమలు చేస్తున్నా మని ప్రభుత్వం చెబుతోంది. సీఎం చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ… ఈసారి ఆయనకు అనుభవం కంటే అడ్డంకులే ఆటంకాలుగా మారే అవకాశాలు న్నాయి. నిధుల కొరతతో పాటు సంక్షేమాన్ని అమలు చేయడం కత్తిమీద సాముగా మారింది. ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టాలన్న ప్రయత్నంలో … ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని చెప్పేశారు. తల్లికివందనం, అన్నదాతా సుఖీభవ, ఉచిత బస్సు, 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆడబిడ్డ నిధిపై విపక్షం నుంచి విమర్శలు వస్తుండటంతో ఈ ఏడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఏదో ఒక విధంగా రెండేళ్లు అమలు చేస్తే రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చన్న అంచనాతో ప్రభుత్వం పనిచేస్తోందని అంటున్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో ఆడబిడ్డ నిధికి కేటాయింపులు ఉంటాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే బడ్జెట్ లో కేటాయింపులు చేసినా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నదే ఉత్కంఠ రేపుతోంది. ప్రధానంగా ఆడబిడ్డ నిధి, నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భతి ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని ప్రతిపక్ష వైసీపీ పదే పదే గుర్తు చేస్తుంది. ఈ రెండు పథకాలు అమలు చేయాలంటే అంత సులువు కాదు. అర్హులు ఎందరు… ఎవరికి ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఏదో కొందరికి ఇచ్చామని మమ అనిపించడానికి వీలులేదు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా అతిముఖ్యమైన ఆడబిడ్డ నిధి పథకంపై ఇన్నాళ్లు దాటవేస్తూ వస్తోంది. దీనిపై ప్రతిపక్షాల దాడి ఎక్కువగా ఉండటం, లబ్ధిదారులు సైతం ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వం భారీగా వెచ్చించాల్సివస్తుంది. రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు అందరికీ నెలకు రూ.1,500 చొప్ప్పున ఈ పథకం ద్వారా పంపిణీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళల్లో కొందరికి ఇచ్చి మరి కొందరికి పథకం వర్తించకపోతే వ్యతిరేకమవుతారు. నెలనెలా డబ్బు జమ చేయాలా లేక ఏడాదికి ఒకసారి ఇవ్వాలా అన్నదానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. నిరుద్యోగ భృతి కూడా అమలుకు సాధ్యమయ్యే హామీ కాదు. నెలకు రూ.మూడు వేలు ఇవ్వాలంటే ఖజానా సరిపోదు. రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు వారిలో ఏ ఉపాదీ లేనివాళ్లు 1.56 కోట్ల మంది ఉన్నారని ఇంటింటి సర్వేలో తేలింది. వారిలో 52.74 లక్షల మంది వివిధ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకుని ఇళ్ల నుంచి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి అవకాశమిచ్చినా ఉపయోగించుకోవ డానికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేస్తున్నారు. వీరిలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారు 70 శాతం ఉన్నారు. డిప్లొమో, ఇంజినీరింగ్, పీజీ, ఇతర ఉన్నత విద్యార్హతలున్నవారు 20 శాతమున్నట్లు గుర్తించారు. పదో తరగతిలోపు వారు 10 శాతం ఉన్నారు. ఏదో ఒక పని చేస్తున్న 52.69 లక్షల మందిలో 4.31 లక్షల మంది ఇళ్లనుంచే పని చేస్తున్నారు. స్వయం ఉపాది కోసం కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్నవారు ఎక్కువ. రాష్ట్రం మొత్తం మీద పని లేని వారు 1.56 కోట్ల మంది ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం వారందరికీ నచ్చిన రంగంలో నైపుణ్యాలు పెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. నిరుద్యోగ భృతికి నిధులు బడ్జెట్‌లో పెట్టకపోయినా త్వరలోనే అమలు చేయాలన్న నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఆడబిడ్డ, నిరుద్యోగ భతి … ఈ రెండు పథóŠకాల అమలుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వం అప్ప్పులు చేసిందని, రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడేస్తున్నామని చెప్పాలనుకున్నా కుదిరే పని కాదు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు అప్ప్పులు చేయాల్సి వస్తుంది. ప్రతి నెల అప్ప్పుల కోసం దిల్లీ వైపు చూడాల్సి వస్తుంది. మరొకవైపు రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం వంటివి సవాలుగా మారుతున్న సమయంలో చంద్రబాబు … ఈ రెండు పథకాలను అనులు చేయడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాదన్నది ప్రతిపక్షం ఆలోచన.


