Homeఅంతర్జాతీయంగాజాలో 59 వేలకు చేరిన మృతులు

గాజాలో 59 వేలకు చేరిన మృతులు

- Advertisement -

గాజాసిటీ: గాజాలో ఇజ్రాయిల్‌ గత 21 నెలలుగా భీకర పోరు సాగిస్తోంది. ఏకపక్షంగా వైమానిక, భూతల దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటివరకు చనిపోయిన పలస్తీనియన్ల సంఖ్య 59వేలు దాటిందని పలస్తీనా వైద్యశాఖ వెల్లడిరచింది. 2023, అక్టోబరు 7న నుంచి మొత్తం 59,029 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారని, మరో 1.42 లక్షల మంది క్షతగాత్రులయ్యారని ఆ శాఖ తెలిపింది. మృతుల్లో సగం మంది మహిళలు, పిల్లలేనని పేర్కొంది. ఆకలికి తాళలేక అన్నం కోసం పడిగాపులు కాస్తున్న గాజా వాసులపై ఇజ్రాయిల్‌ దాడులకు పాల్పడుతోంది. యుద్ధ ట్యాంకులు, తుపాకీలతో వారిపై విరుచుకుపడోతంది. ఈ మేరకు ప్రపంచ ఆహార సంస్థ(డబ్ల్యూఎఫ్‌ఓ) పేర్కొంది. గాజాలో ఆహార ట్రక్కుల వైపు దూసుకెళ్లిన జన సమూహంపై ఇజ్రాయిల్‌ దళాలు చేసిన దాడిలో 80 మంది చనిపోయిన విషయం విదితమే. ముందస్తు హెచ్చరికలు చేసినట్లు ఇజ్రాయిల్‌ సమర్థించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు