విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఫ్లోరోసిస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని , సందర్శించిన , జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ జి.ఆంజనేయులు ఫ్లూోరోసిస్ సిబ్బంది టీ.శశికల పాల్గొని ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ ఫ్లోరోసిస్ పై, ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్య సిబ్బందికి మరియు ప్రజలకు ఫ్లో రోసిస్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులకు, చేతి కర్రలు,వాకర్స్, నడుము, మెడ బెల్టులు అందజేశామని తెలియజేశారు. ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పాఠశాలలో విద్యార్థులకు ఫ్లోరోసిస్ఫై అవగాహన కల్పించవలనని తెలియజేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, క్షేత్రస్థాయికి వెళ్లి, ఫ్లోరోసిస్ బాధితులను గుర్తించి , ఆరోగ్య విద్య అందించాలని తెలియజేశారు, ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు మల్టీవిటమిన్ మాత్రలతో పాటు ఆహారపు అలవాట్ల గురించి తెలియజేయాలని తెలిపారు. వాటర్ శాంపిల్ సేకరణ చేసి అవసరం ఉన్నవారికి పునరావాస పరికరాల పంపిణీ చేయాలనీ తెలియజేశారు. ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఫ్లూోరోసిస్ డెంటల్ స్క్రీనింగ్ కార్యక్రం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శశికల ,మెడికల్ ఆఫీసర్ పుష్పలత , హెల్త్ సూపర్వైజర్ రాజశేఖరరెడ్డి, ఆరోగ్య సిబ్బంది, సిహెచ్ ఓఎస్ లు, ఏఎన్ఎంలు, పాల్గొన్నారు.
ఫ్లొరోసిస్ వ్యాధి పై అవగాహన
- Advertisement -
RELATED ARTICLES


