Homeరేపటి నుంచి పార్లమెంట్‌

రేపటి నుంచి పార్లమెంట్‌

- Advertisement -

నేడు అఖిలపక్షం భేటీ
న్యూదిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థికసర్వే ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం వచ్చింది. ఆదివారం రోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. జనవరి 28 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ రెండు దశల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తుండగా… మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తారు. ఇదిలాఉంటే… గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్‌ఐఆర్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం కీలక బిల్లులు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఈసారి పార్లమెంట్‌ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగంలో సంస్కరణల కోసం వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెక్యూరిటీస్‌ మార్కెట్‌్స కోడ్‌ బిల్లును కూడా ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు