- Advertisement -
విశాలాంధ్ర-హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆరఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద కేసులు నమోదు చేశారు. రైల్ రోకో కేసులో కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. 2025 నవంబరు 28 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆరఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో రైల్ రోకో చేపట్టారు.


