జనవరి 7 నుంచి 12 వరకు నడవనున్న సర్వీసులు
సంక్రాంతి పండుగ సమయం సందర్భంగా సొంతూళ్లను వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.పండుగ రద్దీని దృష్టిలో ఉంచి, ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు చెప్పారు.ఈ రైళ్లు జనవరి 7 నుండి 12 వరకు కాకినాడ, వికారాబాద్,పార్వతీపురం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలు నిర్వహిస్తాయి.
ప్రధానంగా కాకినాడ టౌన్ – వికారాబాద్ (07186, 07460),వికారాబాద్-కాకినాడ టౌన్ (07185, 07187) మార్గాల్లో రైళ్లు చలామణీ అవుతాయి.అలాగే, వికారాబాద్ – పార్వతీపురం (07461), పార్వతీపురం – వికారాబాద్ (07462), పార్వతీపురం – కాకినాడ టౌన్ (07463), సికింద్రాబాద్ – పార్వతీపురం (07464, 07465) మార్గాల్లో కూడా సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఇప్పటికే ప్రారంభమైన టికెట్ బుకింగ్లు
ఈ రైళ్లలో AC, స్లీపర్,జనరల్ కోచ్లు ఉంటాయని, ఇప్పటికే రిజర్వేషన్లు ప్రారంభమైందని రైల్వే శాఖ పేర్కొంది.విజయవాడ ద్వారా కూడా కొన్ని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.విశాఖపట్నం – చర్లపల్లి (08511)ప్రత్యేక రైలు జనవరి 10,12,17,19 తేదీల్లో సాయంత్రం 5.30గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి,మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుంది.తిరుగు ప్రయాణం జనవరి 11, 13, 18, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా,అనకాపల్లి – వికారాబాద్ (07416)ప్రత్యేక రైలు జనవరి 18న రాత్రి 9.45కి బయలుదేరనుంది.పండుగ సందర్భంగా ప్రయాణికుల నుండి ఎక్కువ డిమాండ్ ఉన్నందున ఈ ప్రత్యేక రైళ్లు నడపడం నిర్ణయించామని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు.


