Homeజిల్లాలుప్రకాశందరఖాస్తుచేసుకున్న వారికి 125రోజులు పనులు

దరఖాస్తుచేసుకున్న వారికి 125రోజులు పనులు

- Advertisement -

విశాలాంద్ర – వలేటివారిపాలెం : విబిజిరామ్ జి పథకంలో దరఖాస్తు చేసుకున్న శ్రామిక కుటుంబానికి ఒక ఆర్ధిక సంవత్సరంలో 125రోజులు పనులు కల్పించడం జరుగుతుందని, ఆలా చేయని పక్షంలో 15రోజులు తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని ఏపీఓ దయాసాగర్ అన్నారు. శుక్రవారం మండలంలోని బడేవారిపాలెం గ్రామంలో జరుగుతున్న విబిజి రామ్ జి పథకం పనులను ఏపీఓ దయాసాగర్ పరిశీలించారు.ఈ సందర్బంగా కూలీలకు పథకం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఏపీఓ దయాసాగర్ మాట్లాడుతూ జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. ఇక నుంచి ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 125రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ పథకం లో డిజిటల్ వ్యవస్థ ద్వారా హాజరు చెల్లింపులు జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా గ్రామ పంచాయతీలో పని అడిగిన వెంటనే పనులు కల్పించడం జరుగుతుందని అన్నారు. లేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వేతనాలు నిర్ణీత సమయంలో చెల్లిస్తానని లేనిపక్షంలో ఆలస్య చెల్లింపులకు పరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం పై అలాంటి అపోహలు వద్దని అన్నారు.ఈ సందర్బంగా పథకం ద్వారా లభించే గొప్ప అవకాశాలు, సదుపాయాలుమరియు ప్రయోజనాలు నాకు మాత్రమే కాకుండా నా కుటుంబానికి మరియు సమాజానికి ఉపయోగపడేలా పూర్తి బాధ్యతతో పనిచేస్తానని త్రికరణశుద్దిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని శ్రామికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ దయాసాగర్, పీల్డ్ అసిస్టెంట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు