Homeఅంతర్జాతీయం18న అధికారికంగా బదులిస్తాం

18న అధికారికంగా బదులిస్తాం

- Advertisement -

మోదీ`జిన్‌పింగ్‌కు ఫోన్‌ చేస్తా: అమెరికా సుంకాలపై లూలా

బ్రసిలియా: అమెరికా తమ దేశంపై విధించే అధిక సుంకాలకు ప్రత్యామ్నాయ ప్రణాళికతో బదులిస్తామని, ఈ వ్యవహారాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) దృష్టికి తీసుకెళతామని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్లా అన్నారు. అమెరికా విధానాన్ని డబ్యూటీఓ ఎదుట సవాల్‌ చేసిన తర్వాత ఈనెల 18న ఆ దేశ చర్యలకు అధికారికంగా స్పందిస్తామని అధ్యక్షుడు చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, సుస్థిర ఆర్థిక`సామాజిక అభివృద్ధిపై బ్రసిలియాలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు మాట్లాడుతూ అమెరికా వాణిజ్య చర్య అన్యాయమైనదన్నారు. అంతర్జాతీయ వేదికగా బ్రెజిల్‌ గణనీయమైన పురోగతి సాగించిందని చెప్పారు. బ్రెజిల్‌ ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ అన్యాయమైన పద్ధతిని ప్రత్యామ్నాయ, ఆకస్మిక ప్రణాళిక ద్వారా ఎదుర్కొంటామని, ఆర్థికంగా, సామాజిక నష్టాన్ని నివారిస్తామన్నారు. విదేశీ వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడిరచారు. తనతో చర్చలకు అమెరికా అధ్యక్షుడు సిద్ధంగా లేరని, చైనా, భారత అధినేతలు జిన్‌పింగ్‌, మోదీతో ఫోన్‌లో మాట్లాడతానని లూలా చెప్పారు. రష్యా తమతో కలిసి రావడం లేదు కాబట్టి ఆ దేశాధినేత పుతిన్‌తో సంప్రదింపులు జరిపే ఆలోచన లేదన్నారు. మిగతా దేశాల నాయకులకు ఫోన్లు చేస్తానన్నారు. అయితే, బ్రెజిల్‌పై అత్యధికంగా 50 శాతం సుంకాన్ని టారిఫ్‌ విధించారు. బ్రెజిల్‌లో కాప్‌30 సదస్సు ఈ ఏడాది జరగనుంది. ఈ కార్యక్రమానికి ట్రంప్‌ను ఆహ్వానిస్తానని లూలా తెలిపారు. వాతావరణ మార్పులపై అభిప్రాయం కోసమే ఆయనను ఆహ్వానిస్తానని, రావడం, రాకపోవడం ఆయన ఇష్టమని అన్నారు. ట్రంప్‌తో వాణిజ్య చర్చలకు తాము సిద్ధమని లూలా డ సిల్వా వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు