Homeజిల్లాలుతూర్పు గోదావరిఘనంగా 79వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘనంగా 79వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు : మండలంలోని గ్రామ గ్రామాన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా స్వతంత్ర పోరాట సమరంలో ప్రాణ త్యాగం చేసిన త్యాగమూర్తులను  స్మరించుకున్నారు.  బాలాజీ నగర్ మంత్రి కార్యాలయం లో జరిగిన వేడుకలు  నిడదవోలు పట్టణం జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో కూటమీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ షేక్ వసీరుద్దీన్ పట్టణ జనసేన పార్టీ కౌన్సిలర్లు జనసేన పార్టీ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిడదవోలు తెలుగుదేశం పట్టణ కార్యాలయం లో పట్టణ టిడిపి అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ బటర్ఫ్లై  స్కూలు  బాల బాలికలు టీచర్స్,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  దేశంకోసం పోరాడి సేవలందించిన రిటైర్డ్ మిలటరీ మెన్ జ్యోతి కాలనీ  చెట్టే సాల్మన్ రాజును ఘనంగా సన్మానించడం జరిగింది. నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భద్రం దొర మాట్లాడుతూ  ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితమే స్వాతంత్ర్యం అన్నారు.స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించిందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం అన్నారు.ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని విస్మరించి ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ పాలన సాగిస్తున్నారని ఈ విధానం భవిష్యత్తులో భారతదేశానికి పెను ప్రమాదంగా మారుతుందని  భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమలు కావాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే సాధ్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరలాల్, పెరవలి మండల అధ్యక్షులు బుద్ధన లక్ష్మణరావు, ఖాకీ కిషోర్, షేక్ నాగూర్, మహమ్మద్ అన్వర్ ఖాన్, పుచ్చకాయల ప్రసాద్, గుర్రం రమేష్, ఉంగులూరి వెంకన్న, షేక్ చినజిలాని, తివనాని వెంకటరమణ, రాము మహిళా నాయకురాలు దారపురెడ్డి సుజాత  ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. 79 వ స్వాతంత్ర  దినోత్సవం అట్లపాడు గ్రామ పంచాయతీ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ దాయం రత్నకుమారి జెండా వందనం చేసి దేశం యొక్క ప్రాముఖ్యతని గ్రామ స్కూల్ పిల్లలకు,ప్రజలకు తెలియజేసారు. కార్యక్రమంలో పంచాయితీ బోర్డ్ సభ్యులు, సెక్రెటరీ అమృత్ గారు, సచివాలయ సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు, ఆశా వర్కర్లు, డ్వాక్రా సిబ్బంది,శానిటేషన్ వర్కర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు