Homeజిల్లాలుశ్రీ సత్యసాయి20 న జరగబోయే సార్వత్రిక సమ్మె వాయిదా.. సిఐటియు నాయకులు

20 న జరగబోయే సార్వత్రిక సమ్మె వాయిదా.. సిఐటియు నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం: మే నెల 20న జరగబోయే సార్వత్రిక సమ్మె వాయిదా వేయడం జరిగిందని సిఐటియు నాయకులు జెవి రమణ, టి. అయుబ్ ఖాన్, ఎస్హెచ్ భాష ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మే 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె ప్రస్తుత దేశ పరిస్థితులకనుగుణంగా. సమ్మె నిర్వహించడం సమంజసంగా ఉండదని జాతీయ నాయకులు తెలపడం జరిగిందన్నారు. భారత దేశంలో అనేక సామాజిక సంక్షోభాలు జరుగుతున్న,
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యవస్థ నిర్వీర్యం చేయడం కోసం నాలుగులేబర్ కోడ్ లను అమలు చేసే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నదని ,కార్మికుల కనీస వేతన అమలు చేయడం లేదని వారు తెలిపారు. ఎనిమిది గంటల పని విధానాన్ని లేకుండా చేస్తున్నదని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని,పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యంకాదని తెలిపారు. కానీ బడా పెట్టబడుదారులకు దాదాపుగా 69 వేలకోట్లు మాఫీచేయడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యమవుతుందని, కావున ఇటువంటి అనేక విధానాలను అమలు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు.
కానీ ఇటువంటి సందర్భంలో సామాజిక పరిస్థితులు బట్టి ఈనెల జరిగే సమ్మెను జూలై 9 వ తారీఖుకు వాయిదా వేయడం జరిగిందని ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్ ఆదినారాయణ, ఎం బాబు, బొగ్గు నాగరాజు, నాగవేణి ,జయమ్మ, అనిల్ ,దస్తగిరి ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు