- Advertisement -
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని కేశవ నగర్ లో బి వి ఆర్ బిల్డింగ్ వద్ద మంజునాథ్ అనే కూలి (32) బిల్డింగ్ పరదాలు పగలుగొట్టే సమయంలో, దానికుండే ఇనుపకడ్డి పెద్ద విద్యుత్ లైనుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కేతిరెడ్డి కాలనీకి చెందిన వ్యక్తిగా వన్ టౌన్ పోలీసులు గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. భార్య డెలివరీ కోసం తన పుట్టింటికి వెళ్ళింది. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఉన్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


