Sunday, July 20, 2025
Homeజిల్లాలుకర్నూలుసొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలి

సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలి


–మేనేజర్ రవి ప్రకాష్

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : సింగిల్ విండో సొసైటీ ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో రెన్యూవల్ చేసుకొని సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలని సొసైటీ బ్యాంక్ మేనేజర్ రవి ప్రకాష్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సొసైటీ మేనేజర్ రవి ప్రకాష్, సీఈవో రవికుమార్ లు మాట్లాడుతూ రైతులు సొసైటీలో తీసుకున్న పంట రుణాలు ఏడాదిలోపు చెల్లించాల్సి ఉంటుందని, ఏడాది గడువుదాటితే వడ్డీ ఎక్కువవుతుందని, దాని వల్ల రైతులకే నష్టం కలుగుతుందని సూచించారు. రుణాలు రెన్యువల్ చేసుకోవడం ద్వారా వడ్డీ తక్కువ పడుతుందని వారు తెలిపారు. అదేవిధంగా దీర్ఘకాల రుణాలు తీసుకున్న వారు కూడా సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని, రైతుల కోసం పనిచేసే సొసైటీలను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైనే ఉందన్నారు. సకాలంలో రుణాలు చెల్లించకపోతే నోటీసులు అందజేస్తామని వారు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు