- Advertisement -
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో కూలీలను పనికి తీసుకెళ్లిన మేస్త్రీ శివ ప్రాణాలతో బయటపడగా ఆయన భార్య చిట్టెమ్మ మృతి చెందింది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.


