Homeఆంధ్రప్రదేశ్తిరుపతి రైల్వే‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం..లూప్ లైన్ లో ఉన్న రైళ్లలో ఒక్కసారిగా మంటలు

తిరుపతి రైల్వే‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం..లూప్ లైన్ లో ఉన్న రైళ్లలో ఒక్కసారిగా మంటలు

- Advertisement -

రెండు బోగీలు దగ్ధం

భయాందోళనలకు గురైన ప్రయాణికులు
తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్ లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. రాయలసీమ, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లలో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో రైల్వే స్టేషన్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక శకటాలతో వారు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో బోగి పూర్తిగా దగ్ధమైంది. రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో.. ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించగానే.. ఇంజిన్ నుంచి బోగీలను వేరు చేశారు. ఈ రెండు రైళ్లు రాత్రికి బయలుదేరాల్సి ఉంది. ఆ క్రమంలో వీటిని లూప్ లైన్‌లో ఉంచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు