Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే రాష్ట్రము అభివృద్ధి...

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే రాష్ట్రము అభివృద్ధి…

- Advertisement -

ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; నాయకుడిగా కాదు.. సేవకుడిగా మీ ఇంటికి వచ్చాను అని, ఎన్డీఏ ప్రభుత్వ ద్వారా రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మూడవరోజు పాదయాత్రలో భాగంగా వారు 21 వ, 22వ వార్డులలో పర్యటించారు. వీరితోపాటు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా ముఖ్య అతిథులుగా హాజరై పాదయాత్రను విజయవంతం చేశారు.
పాదయాత్రలో ఎన్డీఏ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా విన్నారు.
ఈ సందర్భంగా మంత్రి, ఎన్డీఏ నాయకులు మాట్లాడుతూ మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు. పెన్షన్లు ఇంటి పట్టాల విషయంలో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వారు దుయ్య బట్టారు.
అర్హత ఉన్నవారికి పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు
మౌలిక సదుపాయాల విషయానికొస్తే ఇవాళ తాగునీటి సమస్యను ప్రతికూలంగా వినిపించడం జరిగిందని, అమృత్ పథకంలో గతంలో మంజూరైన ట్యాంకుల నిర్మాణాలు పూర్తికాలేదు అని తెలిపారు. అందుకే డైరెక్ట్ పంపింగ్ చేస్తూ తాత్కాలికంగా నీరు ఇస్తున్నాం అని, కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు అని స్పష్టం చేశారు.భవిష్యత్తులో తాగునీటి సమస్య ఎక్కడా ఉండదు అని, ఇదే మా కృషి అని తెలిపారు. అలాగే చేనేత సమస్యల విషయానికొస్తే ధర్మవరం చేనేతలకు కొత్త శక్తి ఇవ్వాలనే లక్ష్యంతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌కు కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం తెలిపింది అన్నారు. కేంద్రం నుంచి 30 కోట్లు, రాష్ట్రం నుంచి 10 కోట్లు కలిపి మొత్తం 40 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు.ఇది 20 వేల మందికి ఉపాధిని కల్పించడమే కాక, మార్కెటింగ్ వ్యవస్థ కూడా చేనేతల చేతిలోకి వస్తుంది అని తెలిపారు. 87 కిలోమీటర్ల స్టేట్ హైవే అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు పంపించాం అని, ఇందులో 27 కిలోమీటర్ల బైపాస్ రోడ్ కూడా ఉంది అని, ఇది ధర్మవరం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. వారు ఇప్పటికీ 33,000 కోట్లతో పింఛన్లు, 10,000 కోట్లతో తల్లికి వందనం, గ్యాస్ సబ్సిడీలు, రైతులకు మద్దతు వంటి పథకాలను గుర్తుచేస్తున్నారు. మళ్లీ వీటిని అమలు చేయగలిగిన నాయకత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపంలో, పవన్ కళ్యాణ్ రూపంలో ఉందని తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ విశ్వనాయకుడిగా ఆయన ప్రపంచానికి నూతన భారతాన్ని చూపిస్తున్నారు అని తెలిపారు.పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు, వినతులకు అధికార ద్వారా పరిష్కారం తప్పక అందించబడుతుందని తెలిపారు.
ఈ పాదయాత్రలో బిజెపి జాతీయ నాయకులు అంబటి సతీష్, టీడీపీ టిడిపి పట్టణ అధ్యక్షులు, బిజెపి పట్టణ అధ్యక్షులు చంద్ర, రూరల్ అధ్యక్షులు చంద్ర, సుధాకర్, ఏపీ సీడ్స్ డైరెక్టర్ కమతం కాటమయ్య, మహేష్ చౌదరి, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యామ, రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు జయశ్రీ, బిజెపి మహిళా నాయకురాలు కంచం లీలావతి, ఎన్డీఏ కూటమి నాయకులు ఫణి కుమార్, పురుషోత్తం గౌడ్, ఓబులేష్, పోతుకుంట రాజు, కేసగాళ్ల శ్రీనివాసులు, రాజారెడ్డి, డిష్ రాజు, ఎన్డీఏ కూటమి మహిళా నాయకురాలు, మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు