అహ్మదాబాద్‌లో గత నెల 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. విమానం టేకాఫ్ తర్వాత ఇంధన స్విచ్‌లు ఆగిపోవడంతో రెండు ఇంజిన్లు ఆగిపోయాయని అందులో పేర్కొంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, కిందనున్న మరో 19 మంది మరణించారు. కాక్‌పిట్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరో పైలట్‌ను “ఇంధనం స్విచ్‌లు ఎందుకు ఆపావు?” అని అడగగా, మరొకరు “నేను ఆపలేదు” అని సమాధానం చెప్పినట్టు నివేదిక తెలిపింది.
ఈ నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో వెల్లడించిన విషయాలపై ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ కమిటీలో పైలట్లకు చోటు కల్పించకపోవడం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాథమిక నివేదికను బహిరంగంగా అందుబాటులో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.


