వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ తన పదవి నుంచి ఆగస్టులో వైదొలగనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన తెలిపింది. అనంతరం ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా చేరనున్నారు. కొత్త డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలిన్ జార్జివా త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, భారత సంతతికి చెందిన అమెరికన్ అయిన గీతా గోపీనాథ్ 2019లో చీఫ్ ఎకనామిస్ట్‌గా ఐఎంఎఫ్‌లో చేరారు. ఆ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. 2022 జనవరిలో ఫస్ట్ డిప్యూటీ మేనిజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వీడి ఐఎంఎఫ్‌లో బాధ్యతలు చేపట్టిన గీతా తిరిగి బోధనా వృత్తిలోకి వెళ్లనుండటం చర్చనీయాంశంగా మారింది.
ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ గుడ్‌బై
- Advertisement -
RELATED ARTICLES


