Homeజాతీయంపహల్గాం దాడి ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని హతమార్చాం..

పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని హతమార్చాం..

- Advertisement -

ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ సందర్భంగా అమిత్‌ షా
ఏప్రిల్‌ 22న పహల్గాం (phalgam) లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amithshaw)ప్రకటించారు. ఆపరేషన్‌ సిందూర్‌ పై లోక్‌సభలో (loksabha) రెండో రోజు చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ సందర్భంగా ఇవాళ అమిత్‌ షా మాట్లాడారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుబెట్టినట్లు వెల్లడించారు. ఈనెల 22న శాటిలైట్‌ ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా ఉగ్రవాదుల కదలికలను గుర్తించాం. ఆపరేషన్‌ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రదాడి జరిగిన రోజునే జమ్ము భద్రతపై సమీక్షించాం. ఉగ్రవాదులను ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా అరెస్ట్‌ చేశాం. ఉగ్రశిబిరాలను మట్టిలో కలిపేశాం. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జమ్ము పోలీసులకు అభినందనలు్ణ అని అమిత్‌ షా తెలిపారు. ఉగ్రవాదుల్ని హతమార్చాం అంటే విపక్షాలు సంతోషిస్తాయనుకున్నానని, కానీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారంటూ షా వ్యాఖ్యానించారు.

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ సమీపంలో ఉన్న హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో గడిచిన నెలరోజులుగా ఆ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. లష్కరే, జైషే ఉగ్రవాదుల కదలికల కోసం గడిచిన 14 రోజులుగా మరింత ముమ్మరంగా నిఘాను పెంచాయి. ఈ క్రమంలో దాచిగామ్‌ నేషనల్‌ పార్క్‌ పరిసరాల్లో రెండు రోజుల కిందట అనుమానస్పద కమ్యూనికేషన్లను భారత సైన్యం పసిగట్టింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో దాచిగామ్‌ నేషనల్‌ పార్క్‌ పరిసరాల్లో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు.. మెరుపు వేగంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్‌ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్‌ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హామ్‌జా కూడా హతమైనట్టు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులేనని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు పాలుపంచుకొన్నట్టు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం జరిపిన సోదాల్లో 17 గ్రెనెడ్లు, ఒక ఎం4 కార్బైన్‌, రెండు ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు