Homeఆంధ్రప్రదేశ్జిఎస్ఎల్వి ఎఫ్- 16 రాకెట్ ప్రయోగం ఘన విజయం

జిఎస్ఎల్వి ఎఫ్- 16 రాకెట్ ప్రయోగం ఘన విజయం

- Advertisement -

. నింగిలోకి చేరిన నిసార్’ఉపగ్రహం
. షార్ నుండి అద్భుత ప్రయోగం

విశాలాంధ్ర – సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి బుధవారం జిఎస్ఎల్వి ఎఫ్-16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు బుధవారం సాయంత్రం 5.40 నిమిషాలకు నింగిలోకి పంపారు. 18నిమిషాల40 సెకండ్లలో నిసార్ ఉపగ్రహం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి చేరింది. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రో, నాసా శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం ఇస్రో శాస్త్రవేత్తల ఘనవిజయమని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. ఇస్రో ఉద్యోగస్తులకు, వారి కుటుంబ సభ్యులకు చైర్మన్ అభినందనలు తెలిపారు. శ్రీహరికోట నుండి మరిన్ని భారీ ప్రయోగాలు ప్రయోగించనున్నామని తెలిపారు. శాస్త్రవేత్తలు భూ పరిభ్రమణం లో వస్తున్న మార్పులు భూగోళంలో ఏమి జరుగుతుందో ప్రతి రోజుకు ఒకసారి స్కానర్తో సమగ్ర సమా చారాన్ని అర చేతిలో పెట్టేందుకు రూపకల్పన చేసిన ఓ అద్భుత రాకెట్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇస్రో, నాసా.. రెండూ కలిసి రూపకల్పన చేసిన నిస్సార్ ఉపగ్రహ ప్రయోగo ఘన విజయం సాధించింది. నిసార్ డ్యూయెల్ రాడార్ సిస్టమ్ను కలిగి ఉంది. ఎస్ బ్యాండ్ సిథటిక్ ఎపర్చర్ రాడారు ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ను నాసా రూపొం దించాయి. ఇది మేఘాలను దాటిన తర్వాత కూడా సెం టీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్ట గలదు. నిసాన్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు మొత్తం భూమిని స్కాన్ చేస్తుంది. ప్రతి కదలిక లేదా మార్పును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. బెంగ ళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూ ఆర్ఎస్సీ)లో ఈ శాటిలైటు రూపొం దించారు. ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు జరుగు తున్నాయి.
భూ సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నం
పెరుగుదల సహా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్పోటనాలు, కొండచరియలు విరిగి పడడం వంటి ప్రకృతి విపత్తుల ముందస్తు సమాచా రాన్ని అందిస్తుంది. ముఖ్యంగా భూకం పాలు, అగ్ని పర్వత విస్ఫోటనాలు, కొండ చరియలు విరిగిపడటం, వరదలు, భూమి కుంగి పోవడం వంటి ప్రకృతి వైప రీత్యాలను పర్యవేక్షించడంలో అర్థం చేసుకోవ డంలో శాస్త్రవేత్తలకు సహాయం చేయడమే ఈ మిషన్ లక్ష్యం.
ఈ ఉపగ్రహం బరువు దాదాపు 2,800 కిలోలు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయెల్ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. సముద్రంపై మంచు కదలికల పరిశీలన అటు అంటార్కిటిక్ పోలార్ స్టేషన్ల చుట్టూ ఉన్న సముద్రాల మీద ఉండే లక్షణాలు పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. మరోవైపు పర్యావరణ వ్యవస్థలు, వృక్ష సంపద, జీవవైవిధ్యం, భూగర్భ జలాలు, సముద్ర మట్టం
ఇస్రో ప్రయోగ వాహనం నిస్సార్ ఉపగ్రహాన్ని 98.40 వంపుతో 743 కిలోమీటర్ల సూర్య-సమకాలిక కక్ష్య (ఎస్ఎస్ఓ)లోకి ప్రవేశపెట్టింది. ఎస్ఎస్ఓ అనేది ఒక ధ్రువ కక్ష్య. ఇక్కడ ఒక ఉపగ్రహం ప్రతిరోజూ అదే స్థానిక సౌర సమయంలో భూమిపై ఏదైనా ఇచ్చిన బిందువుపై వెళ్తుంది. నిరంతర ప్రకాశం కోసం సూర్యు డికి సంబంధించి స్థిరమైన కోణాన్ని నిర్వహిస్తుంది. ఇమేజింగ్ లేదా ఇతర సమయసున్నితమైన పనులకు ఇది అవసరం. నిసార్ మిషన్.. నాసా, ఇస్రో మధ్య సమాన భాగస్వామ్యం కలిగిఉన్నది. ఇది నాసా, ఇస్రో మధ్య మొదటి హార్డ్వేర్ సహకారాన్ని సూచిస్తుంది. అంతరిక్ష సంస్థ రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ టె క్నాలజీ, శాస్త్రీయ పరికరాలను అందిస్తోంది. ఇస్రో అంతరిక్ష నౌక, ప్రయోగ వాహనం, కార్యాచరణ మద్దతును అందిస్తోంది అని శాస్త్రవేత్తలు తెలిపారు.షార్ డైరెక్టర్ రాజరాజన్ మాట్లాడుతూ ఈ ప్రయోగం ఒక అద్భుతమని ప్రపంచ దేశాలు భారత వైపే చూసేంత అద్భుత ప్రయోగం అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్. ఉన్ని కృష్ణన్ నాయక్ డైరెక్టర్ వి ఎస్ ఎస్ సి మాట్లాడుతూ ఈ ప్రయోగం ఒక చారిత్రాత్మక ప్రయోగమని ఇది ఇస్రో ,నాసా, శాస్త్రవేత్తల కృషి ఫలితం అని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంత ఆమనడంతో సులూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయ్ శ్రీ, శ్రీ సిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కొండేపాటి గంగా ప్రసాద్, తదితరులు ఇస్రో , నాసా,శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు