డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల తొమ్మిదవ తేదీ పౌర్ణమి సందర్భంగా అరుణాచలం, గిరి ప్రదర్శన, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాను పోను చార్జీలు 1400 రూపాయలు మాత్రమేనని తెలిపారు. దర్శనానికి వెళ్లవలసిన భక్తాదులు ఆన్లైన్లో గాని, బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో గాని, సీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కలదని వారు తెలిపారు.”భగవంతుని సేవలో భక్తులు!! భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఎల్లప్పుడు ముందంజలో” ఉంటుందని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9959225859 కు సంప్రదించాలని తెలిపారు.
గోల్డెన్ టెంపుల్ దర్శనం కొరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు నిర్వహణ..
- Advertisement -
RELATED ARTICLES


