Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత వైద్య శిబిరములకు విశేష స్పందన..

ఉచిత వైద్య శిబిరములకు విశేష స్పందన..

- Advertisement -

కృతజ్ఞతలు తెలియజేసిన ధర్మవరం స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్

విశాలాంధ్ర ధర్మవరం;! ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి లోని సి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో రెండు ఉచిత వైద్య శిబిరములకు విశేష స్పందన రావడం పట్ల ధర్మవరం స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊపిరితిత్తులు, చాతి జబ్బుల వైద్య శిబిరమును ప్రముఖ వైద్యులు డాక్టర్ కే పూర్ణచంద్ర (పల్మ లాలజిస్ట్), అదేవిధంగా చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మహమ్మద్ గౌస్, డాక్టర్ రితిక్ రవీంద్ర లచే 234 మంది రోగులకు ఉచితంగా వైద్య చికిత్సలను అందిస్తూ, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో ఉచితంగా వైద్య చికిత్సలు అందించడంతోపాటు మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అర్హులైన చిన్న పిల్లలకు ఉచితంగా అడ్మిషన్ చేసుకొని ఉచిత వైద్య చికిత్సలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరా ఏర్పాటు చేసినందుకు స్పందన హాస్పిటల్ వారికి చెన్నై కొత్తపల్లి మండల వాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ శిబిరంలో అలర్జీలు, తుమ్ములు, తగ్గు, ఆస్తమా, క్షయ, ఊపిరితిత్తులలో నీరు చీము చేరిన వారికి చికిత్సలు అందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పురిటి పిల్లలు చిన్న పిల్లల వైద్య నిపుణులు మహమ్మద్ గౌస్ చే విష జ్వరాలు జలుబు కామెర్లు మొదలైన జబ్బులకు ఉచితంగా చికిత్సలను అందించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పందన హాస్పిటల్ మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, సిబ్బంది దిల్దార్, నర్సులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు