– ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు తొలి అడుగు*
విశాలాంధ్ర – తూర్పుగోదావరి :
జిల్లాను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు “స్వచ్చరథం” కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో స్వచ్చరథం ఇంటింట తిరుగుతూ గృహాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించనుంది. సేకరించిన ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా గృహిణులకు స్నానం సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు, నూనె ప్యాకెట్లు, పసుపు, బెల్లం, చింతపండు, ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువులు అందజేస్తారన్నారు..పల్లెల్లో పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి, గ్రామాలను శుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమం ఒక మోడల్‌గా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా సహకరించాలని ఆమె కోరారు.శుక్రవారం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వచ్చరథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, “అందరం కలిసికట్టుగా కృషి చేసి జిల్లాను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, ఎస్పీ డి నరసింహా కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డిపిఒ పి.శాంతామణి తదితరులు పాల్గొన్నారు


