విశాలాంధ్ర – రాజమహేంద్రవరం :
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు.స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “స్వాతంత్రం అనేది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, అది బాధ్యత కూడా” అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుతూ ప్రజలకు న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే చట్టాన్ని గౌరవించి న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలని పౌరులకు పిలుపునిచ్చారు.దేశ అభివృద్ధికి అవినీతి రహిత పరిపాలన, సమానత్వం, విద్యా విస్తరణ, పేదల సంక్షేమం వంటి అంశాలు కీలకమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత కు పోలీసులు గౌరవ వందనం అందచేశారు.


