కుల, మత విద్వేషాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి
–
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; ప్రజలు కుల, మత విద్వేషాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ పార్టీ ఏ మతాన్ని రెచ్చగొడుతుందో, ఎవరు కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారో అనే అంశాల్ని ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారత దేశ 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ గూడూరి అధ్యక్షతన పలువురు నాయకులు స్వాతంత్ర స్ఫూర్తిదాయక దేశ కాలమాన పరిస్థితులపై ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికినట్టు అవుతుందని డాక్టర్ గూడూరి అన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


