విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రగతి విద్యానికేతన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 280 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల గ్రామం పురవీధుల గుండా భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి విద్యానికేతన్ అధినేత కర్రీ యోహాను మాట్లాడుతూ, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే ఏకైక పండుగ ఆగస్టు15 అని దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగే ఈవేడుకను తమ పాఠశాలలో మరింత ఘనంగా జరపడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి సోదర భావం మరింత పెంపొందించడానికి ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.
280 అడుగుల మువ్వన్నెల జెండాతో విద్యార్థుల ర్యాలీ.
- Advertisement -
RELATED ARTICLES


