.
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం దుళ్ల గ్రామంలో పారిశుధ్య కార్మికులకు ఘన సత్కారం జరిగింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బైపాస్ రోడ్ లోని సంపద కేంద్రం వద్ద జరిగిన ఈ కార్యక్రమం వివిధ పార్టీల నాయకులు, పెద్దలు సమక్షంలో నిర్వహించారు. సుమారు 15 మంది పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పి, పూల మాలలు వేసి, మెమెంటోలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, మాజీ సర్పంచ్ గుర్రపు కొండయ్య మాష్టారు లు మాట్లాడుతూ పారిశుద్య కార్మికుల సేవలను కొనియాడారు. ఆరోగ్య కరమైన సమాజం కోసం పాటుపడే ఇలాంటి వ్యక్తులను తమ చేతుల మీదుగా సన్మానించడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, ఎంపీటీసీ కట్టుంగ నాగరాజు, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, సూరపురెడ్డి భరత్, తూము శ్రీను , మెర్ల అయ్యప్ప, కాయల సత్యనారాయణ, కంటిపూడి శ్రీనివాస్, ప్రత్తి ప్రకాష్, దూడల సత్తిబాబు, కులపాకల సత్తిబాబు, గ్రంథి వెంకయ్య, యర్ర సత్యనారాయణ, చక్రరావు, తాతపూడి బాబీ, టెకి శ్రీనివాస్, కంటిపూడి సాయి, నామాల సుధాకర్, పిచ్చుక వెంకట్రావ్, చెల్లారావ్, కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


