Homeఆంధ్రప్రదేశ్పారిశుద్ధ్యమా !.. నీ చిరునామా ఎక్కడ.?

పారిశుద్ధ్యమా !.. నీ చిరునామా ఎక్కడ.?

- Advertisement -

 

 కొవ్వూరులో పడకేసిన పారిశుధ్యం.

 డ్రైన్లలో సిల్టు తీయడానికి ఏటా 30 లక్షలు ప్రజాధనం వృధా

 అయినా కానరాని ఫలితాలు.

 విశాలాంధ్ర – కొవ్వూరు :  రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కొవ్వూరు పట్టణంలో పారిశుధ్య నిర్వహణ  పూర్తిగాపడకేసింది. ఒకవైపు మున్సిపాలిటీకి సానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడం, మరొకవైపు పారిశుద్ధ సిబ్బంది విధులకు సరిగా హాజరు కాకపోవటం, వారిపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్య వైఖరి అనుసరించడంతో పట్టణంలో ఈ పరిస్థితులు దాపరించాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షాకాలం వచ్చి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ఇవేమీ పాలకులకు గాని, అధికారులకు గాని పట్టడం లేదు. ప్రజలకు ముఖ్య మౌలిక సదుపాయాలైన  చెత్త సేకరణ, డ్రైలను శుభ్రపరచడంలోనూ, వీధిలైట్ల నిర్వహణలోనూ పూర్తిగా విఫలమైందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరొకవైపు లక్షలాది రూపాయలను మున్సిపాలిటీకి టాక్సులుగా చెల్లిస్తున్నా అందు కు తగ్గ సేవలు మున్సిపాలిటీ నుంచి అందటం లేదని ప్రజలు వాపోతున్నారు అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తే గాని ఈ వ్యవస్థ బాగుపడదు అన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

 మేజర్ డ్రైన్లలో సిల్టు తీతకు ఏటా 30 లక్షలు ప్రజాధనం వృధా..

 పారిశుద్ధ సిబ్బంది పట్టణంలోని మేజర్ డ్రైనలలో కనీసం వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసినట్లయితే కాంట్రాక్టుల ద్వారా సిల్టు తీయించి ఏటా 30 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వారి దోసెలల్లో పోయాల్సిన అవసరం లేదు కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇక చిన్న డ్రైన్ల విషయానికొస్తే ప్రతిరోజు సిల్టును పారిశుద్ధ సిబ్బంది తీయకపోవడంతో డ్రైయిన్లు నిండిపోయి వర్షపు నీరు అందులోకి చేరి ఆయా రహదారులపై పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆయా రహదారులపై మురికి చేరడంతో  వాహనదారులు   జారిపడుతున్నారు. మరొకవైపు రాత్రి వేళ వీధిలైట్లు వెలగకపోవడంతో ఈ ప్రమాదాలు అధికమయ్యాయి. ఇక చెత్త చెదరాలు పట్టణాల్లో ఏ కూడాలిలో కొవ్వూరు మున్సిపాలిటీకి సానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో ఈ సమస్యలు నానాటికి పేరుకుపోతున్నాయి. ఉన్న కమిషనర్ బదిలీ కావడంతో ఇన్చార్జి కమిషనర్గా ఏఈ సందీప్ ను నియమించారు ఆయన ప్రస్తుతం కార్యాలయ బాధ్యతలను చూస్తున్నారు అయితే ఆయన అసిస్టెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ని కూడా చూడడంతో పూర్తిస్థాయిలో పట్టణంలోని పారిశుద్ధ పరిస్థితులపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకవైపు ఆర్డీవో మరొకవైపు ఎమ్మెల్యే కొవ్వూరులో ఉంటున్న అధికారులు ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.

  కొవ్వూరు రాని సీఎం చంద్రబాబు పర్యటన – శానిటేషన్ డ్రైవ్ కు ఐదు లక్షల ప్రజా ధనం వృధా..

 ఈనెల 1వ తేదీన సీఎం చంద్రబాబు పెన్షన్లు అందజేయడానికి కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలోని మలకపల్లికి విచ్చేశారు. ఈనేపద్యల్లో  కొవ్వూరు మండలం కాపవరం పంచాయతీ పరిధిలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయ ఆవరణలో హెలిపాడ్ ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు అమరావతి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా కాపవరంలోని హెలిపాడ్ కు చేరుకుని మలకపల్లి వెళ్లారు. ఆయన కొవ్వూరు వస్తారని ఎక్కడ రూట్ మ్యాప్ లో లేదు. అయితే కొవ్వూరు మున్సిపల్ పాలకులు, అధికారులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అదేమిటంటే కొవ్వూరు పట్టణ ప్రారంభం టోల్గేట్ దగ్గర నుంచి గోదావరిపై నిర్మించిన నాలుగో వంతెన గ్రామర్ ఇండియా బ్రిడ్జ్ వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పేరిట నిర్వహించి రూ 5 లక్షలను ఇటీవల జరిగిన కౌన్సిల్ ఎజెండాలో పొందుపరిచారు. అయితే చంద్రబాబు కొవ్వూరు రాలేదు కదా మరి ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటి, ఐదు లక్షల ఏ విధంగా ఖర్చుచేశారు.. అని కౌన్సిలర్లు అడగలేదు అధికారులు సమాధానం చెప్పలేదు. ఇంతకీ ఈ స్పెషల్ డ్రైవ్ కి మిషన్లను వాడామని అందుకే 5 లక్షలు ఖర్చు జరిగిందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ కార్యాలయం ముందు భారీ యంత్రాలు జెసిబి లు ఇటీవల కొనుగోలు చేసి కార్యాలయం ముందు పెట్టారు. ఇవి ఉండగా బయట మిషన్లు తెచ్చి సదరు కాంట్రాక్టరు అది నామినేషన్ పద్ధతి మీద పొంది బిల్లు పెట్టారంటే ఇందులో వాస్తవం ఎంత ఉందో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలియని విషయం కాదు. ఇటువంటి పరిణామాల్లో కొవ్వూరు పట్టణ ప్రజలు సొమ్ము వృధా కాకుండా సద్వినియోగిం

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు