- Advertisement -
విశాలాంధ్ర – కడియం : జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శనివారం కడియం మండలం కడియపులంక లో గల శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించారు. వీరికి సత్యదేవా నర్సరీ అధినేత శ్రీ పుల్లా ఆంజనేయులు ఆగ్లోనిమా మొక్కతో స్వగతం పలికారు. నర్సరీ మొక్కల గురించి, గ్రాఫ్టింగ్ పద్ధతి మరియు ఇంపోర్టెడ్ మొక్కలను గురించి వివరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మొక్కలు ప్రాణవాయువుని ని అందిస్తున్నాయని వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని మరియు వాటిని చూసుకొనే క్రమశిక్షణ బాగుందని తెలిపారు. నర్సరీ అందాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుల్లా వీరబాబు, పుల్లా రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.


