విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : అంతర్ రాష్ట్రస్థాయిలో ఇటీవల జరిగిన క్లస్టర్ సెవెన్ సి బి ఎస్ ఈ గేమ్స్ లో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ఆ పాఠశాల ఎండి కృష్ణ భరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా మంగళవారం తెలిపారు. గత నెల 24, 25, 26 తేదీలలో హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన నాదర్ గుల్ లో జరిగిన అండర్-19 వాలీబాల్ బాలికల విభాగంలో తృతీయ స్థానంలో నిలిచారన్నారు. ఈనెల 9, 10, 11వ తేదీల్లో రాజమండ్రి, తుని లోని శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్ స్కూల్లో జరిగిన క్లస్టర్-7 సీబీఎస్ఈ గేమ్స్ లో ఖోఖో గేమ్స్ అండర్ 17 బాలికల విభాగంలో ఇంటర్ స్టేట్ లెవెల్ లో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులను ఆ పాఠశాల యాజమాన్యంతో పాటు ప్రిన్సిపాల్ ప్రతాపరెడ్డి, కోచులు టిప్పు సుల్తాన్, వీరన్న పాల్గొన్నారు..


