విశాలాంధ్ర పుట్టపర్తి: – విద్యార్థులు ర్యాగింగ్ కు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. మంగళవారం వీడుపల్లి లోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించారు.కళాశాలకు వచ్చిన ఎస్పీకి విద్యార్థులు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలను అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పి రత్న మాట్లాడుతూ విద్యార్థి దశలో స్నేహం ఎంతో గొప్పదని, కళాశాలలో ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతామని తెలిపారు. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఎంతో ముఖ్యమైనదని ఆ దశలో చక్కగా చదువుకోగలిగితే ఉన్నత స్థానాలకు ఎదుగవచ్చని సూచించారు. కళాశాలలో ర్యాగింగ్ చేయడం వల్ల, గంజాయి వాడడం వల్ల, విద్యార్థులలో లైంగిక వేధింపులకు గురి చేయడం వల్ల వచ్చే నష్టాలు చట్టాలను ఎస్పీ తెలియజేశారు. సైబర్ క్రైమ్ పై ఎస్పీ విద్యార్థులకు పూర్తి అవగాహన అందించారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని బాలికలు మహిళల భద్రత కోసం ప్రభుత్వం శక్తి యాప్ను తీసుకువచ్చిందని దాన్ని ప్రతి ఒక్కరు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఆదినారాయణ, సీఐ నోడల్ అధికారి గోపీనాథ్ రెడ్డి, సైబర్ క్రైమ్ సీఐ మోహన్, ఈగల్ ఇన్చార్జి ఎస్ఐ శ్రీధర్, ఇంజనీరింగ్ కళాశాల డీన్ దేవకి దేవి, కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్, మహిళ పిఎస్ డిఎస్పి శ్రీనివాసాచారి, అబ్దుల్ గౌస్, శ్రీధర్, విజయలక్ష్మి, ఎస్సైలు, శక్తి టీం, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ర్యాగింగ్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ రత్న
- Advertisement -
RELATED ARTICLES


