Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కూటమి లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కూటమి లక్ష్యం

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యం అని టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. మండలంలో గల మునికూడలి గ్రామంలో గల మండల పరిషత్ పాఠాలలో సుమారు 17 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతులు భవనాని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బిజెపి ఇంచార్జి నీరుకొండ వీరన్న చౌదరి కలిసి ముఖ్య అతిథిలుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు నీటుగా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఇప్పటికే విద్యార్థులు బంగారు భవితకు అవసరమయ్యే తల్లికి వందనం నిధులను విడుదల చేసి పేద విద్యార్థులకు ఆర్ధిక భరోసా కల్పించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి లక్ష్యంగా కోటమీ ప్రభుత్వం సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు