Homeజిల్లాలుఅనంతపురందేశాభివృద్ధికి చేయూతనిచ్చే యువ ఇంజనీర్లు కావాలి

దేశాభివృద్ధికి చేయూతనిచ్చే యువ ఇంజనీర్లు కావాలి

- Advertisement -

జేఎన్టీయూఏ వీసీ సుదర్శన్ రావు

విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: దేశాభివృద్ధికి చేయూతనిచ్చే యువ ఇంజనీర్లు కావాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. గురువారం
అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు ఇండక్షన్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని వీసీ,కళాశాల చైర్మన్ యం. అనంతరాముడు, డైరెక్టర్ యం, రమేష్ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. ఐఐటి, ఎన్ఐఐటిలో సీటు రాలేదని బాధపడవద్దని , ఇంజనీరింగ్ కోర్సులో చేరిన యువ విద్యార్థులు అధ్యయనం, పరిశోధత్వక అన్వేషణ, పారిశ్రామిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం, అధ్యాపకుల బోధనలను తర్ఫీదుతో ఉజ్వల భవితకు బాటలు వేసేలా ప్రణాళిక కార్యచరణ సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతున్న తరుణంలో విభిన్న ఉజ్వల అవకాశాలు నిచ్చే సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఐ ఓ టి, క్వాంటం టెక్నాలజీ వైపు విద్యార్థులు అడుగులు వేస్తూ.. పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా సన్నద్ధత కావాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను చూపగలిగే యువ శాస్త్రవేత్తలుగా రూపకల్పన, కొత్త అన్వేషణలను చేపట్టాలన్నారు. బీటెక్ తో పాటు స్వయం ఆన్లైన్ కోర్సులు పూర్తిచేస్తూ.. సరికొత్త అధ్యయనాలకు నాంది పలకాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల చైర్మన్ యం .అనంతరాముడు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆకాంక్షలను, కలల స్వప్నాన్ని నెరవేర్చేందుకు కళాశాలల నిరంతరం కృషి చేస్తుందన్నారు. క్రమశిక్షణ, విజ్ఞానానికి నిలయంగా అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల నిలుస్తూ విద్యార్థుల భవితకు బాటిల్ వేస్తూ ఉందన్నారు.పారిశ్రామిక శిక్షణ, నైపుణ్యాలు, కమ్యూనికేషన్, పరిశోదాత్మక కేంద్రాలు, విజ్ఞానం భాండాగరాలను విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత వికాసాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టర్ యం .రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కోర్సులలో పారిశ్రామిక ప్రత్యేక శిక్షణ తరగతులు, స్టార్ట్ అప్స్, కొత్త ఆవిష్కరణల, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక నైపుణ్యంతో తోడ్పాటున అందించేలా సన్నద్ధత చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కుటాల శ్రీనివాసులు , స్కిల్ డెవలప్మెంట్ డైరక్టర్ యం .సురేంద్రనాయుడు , అధ్యాపక బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు