- Advertisement -
విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఎమ్ నవీన్ బుదవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ అర్ ఐ గా బాధ్యతలు నిర్వహించిన రవీంద్ర బదిలీ పై కలక్టరేట్ కు బదిలీ పై వెళ్లారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ ఐ రవీంద్రకు డిప్యూటీ తహసిల్దార్ సునీత, రెవెన్యూ సిబ్బంది శాలువ కప్పి, పుష్ప మాల వేసి సన్మానించారు. అలాగే ఇప్పటివరకూ డిప్యూటేషన్ పై కలక్టరేట్ బాధ్యతలు నిర్వహించిన ఎమ్ నవీన్ ఆర్ ఐ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, వి ఆర్ ఓలు పాల్గొన్నారు.


