Homeఆంధ్రప్రదేశ్రసాభాసగా మారిన మండల సర్వ సభ్య సమావేశం

రసాభాసగా మారిన మండల సర్వ సభ్య సమావేశం

- Advertisement -

సమావేశాన్ని బహిష్కరించిన ఎంపిటిసిలు, సర్పంచ్ లు

15 వ ఆర్ధిక సంఘ నిధులు చెల్లింపులు పై మొదలైన వివాదం.

విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి ఎంపీపీ జొన్నకుటి పోసిరాజు అధ్యక్షతన సోమవారం జరిగిన మండల సర్వ సభ్య సమావేశం 15 వ ఆర్ధిక సంఘ నిధులు పై సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. సర్వ సభ్య సమావేశం లో మొదటిగా లేవనెత్తిన 15 వ ఆర్ధిక సంఘం ద్వారా విడుదలైన నిధుల చెల్లింపులు విషయం లో సర్పంచులు కానీ ఎంపీపీ కానీ ఖర్చు పెట్టేందుకు వీలు లేదంటూ సెక్రటరీ లు, ఎంపీడీఓ అభ్యంతరం చెప్పటాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే ముప్పిడి కి సర్పంచులు ఎంపిటిసిలు ఓ వినతి పత్రం అందించారు. దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇస్తుండగా, సభ్యులు ఎమ్మెల్యే తో మాట్లాడు తుండగా, సభలో పాల్గొన్న టీడీపీ వర్గీయులు ఎంపిటీసీల పైకి దూకుడుగా వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. రావూరుపాడు ఎంపీటీసీ హరిబాబు (జనసేన) కూడా ఓ సందర్భం లో వైకాపా అధికారం లో నిధులివ్వలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాళ్లపూడి మండలం లో వచ్చే నిధులు కంటే ఖర్చు ఎక్కువ చేసారని, అత్యవసర పనులకు నిధులు ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టాలని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం లో ఆ నిధులు కూడా రాలేదు కదా అని ఎమ్మెల్యే బదులు చెప్పటం, ఈ లోగా నే కొంత మంది టీడీపీ నాయకులు ఎమ్మెల్యే తో మాట్లాడుతున్న సభ్యుల ను అడ్డుకోవడం, పోలీస్ రంగ ప్రవేశం చెయ్యటం తో సభ కాస్తా రసాభాస గా మారింది. వివాదం కాస్త పెద్దది కాగా, ఎంపిటిసిలు, సర్పంచ్లు ఈ సభలో మాకు విలువలెనప్పుడు ఎందుకు ఉండాలి, సెక్రెటరీ లతో పరిపాలన చేసుకొండి అంటూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఎంపీడీఓ వేణుగోపాల రెడ్డి నచ్చ చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవటం తో చేసేది లేక అసంపూర్తి గా ముగిసిన సమావేశం నుండి ఎమ్మెల్యే కూడా వెళ్లిపోయారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ, సమావేశం లో అధికారులకు ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పుకునే హక్కు తమకు ఉందని, టీడీపీ కి చెందిన కొంత మంది సభకు ఎటువంటి సంబంధం లేని వారు సమావేశం లొ పాల్గొని తమపై దురుసుగా ప్రవర్తించడాన్ని కూడా తీవ్రంగా పరిగనించారు.ఆర్ధిక సంఘ నిధుల్ని నేనేమి కావలనలేదే. ఎమ్మెల్యే ముప్పిడి ఏ మండలానికి సంభందించిన ఆ నిధులు ఆ అమండలాని కే ఖర్చు పెడతాం తప్ప, తనకేమీ కావాలని అడగలేదని, సభ్యులు ఎందుకు వాకౌట్ చేసారో తనకి అర్ధం కాలేదని ఎమ్మెల్యే ముప్పిడి పేర్కొన్నారు. సభ్యులు వాకోట్ చేసిన అనంతరం సెక్రటరీ లతో మాట్లాడి వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రతి పంచాయతీ కానీ, మండల పరిషత్ కు కానీ ప్రతి నెల అవసరమయ్యే జీతాలు, బ్లీచింగ్, లైట్లు, మోటార్లు వంటి అనేక ఖర్చుకుంటాయని వాటికి కొంత కేటాయించగా, కొంత ఆ పనులు చేసిన వాటికి ఖర్చుపెట్టుకోవాల్సి ఉందని, అది నిబంధన అని అన్నారు. కాగా వైకాపా ప్రభుత్వం లో ఆర్ధిక సంఘ నిధులేమి గ్రామాలకు రాలేదని, ఉదాహరణకు ఎఎంసి నిధులు కూడా లెక్కల్లోనే ఉంది కాని డబ్బులేదని అన్నారు. ఎమ్మెల్యే తొ పాటు ఎఎంసి చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు