Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్నదానం పరబ్రహ్మ సేవతో సమానం..

అన్నదానం పరబ్రహ్మ సేవతో సమానం..

- Advertisement -

యువర్స్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు వైకే శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం : అన్నదానం అనేది పరబ్రహ్మ సేవతో సమానమని యువర్స్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు వై కే శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గురువారం దాతల సహాయ సహకారములతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో తృప్తిగా, సంతోషంగా ఉంది అని తెలిపారు. దాతల సహాయ సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వ్యవహరించడం పట్ల వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడం శుభదాయకమని, డేట్ అన్నదాన కార్యక్రమం రోగులకు సహాయకులకు వరం లాగా మారిందని తెలుపుతూ వారికి ప్రభుత్వ ఆసుపత్రి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేతా లోకేష్, సుంకు సుకుమార్, సత్రశాల మల్లికార్జున, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు