విశాలాంధ్ర పుట్టపర్తి:- గోరంట్ల తహసిల్దార్ కార్యాలయంలో చేయి తడపందే పనులు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు రైతులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గోరంట్ల తహసిల్దార్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వందే పనులు చేయడం లేదని, ఏళ్ల తరబడిగా సాగులో ఉంటున్న భూములకు 1బి అడంగల్ నమోదు చేసేందుకు నిత్యం కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టగుండ్ల పల్లి, గుమ్మయగారిపల్లి గ్రామస్తులు ఏళ్ల తరబడిగా సాగులో ఉంటున్న భూములకు నకిలీ పట్టాలు సృష్టించి వన్ బి అడంగల్ చేయిస్తున్నారని వాపోయారు. పదేపదే కార్యాలయానికి వస్తున్నారంటూ మాపైనే కేసులు నమోదు చేయిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు రైతులు వాపోయారు. గతంలో ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే నకిలీ పట్టాలు రద్దు చేయాలని ఆదేశించినప్పటికీ తహసిల్దారు పట్టించుకోవడం లేదన్నారు. కూలి నాలి చేసుకొని జీవనం సాగించే మేము ఏళ్ల తరబడి సాగులో ఉన్న మా భూములకు వన్ బి అడంగల్ చేయించేందుకు లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
లంచం ఇవ్వందే పని జరగదు…
- Advertisement -
RELATED ARTICLES


