Homeజిల్లాలుఅనంతపురంబాలుడు మృతికి కారణమైన ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేయాలి...ఏఐవైఎఫ్

బాలుడు మృతికి కారణమైన ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేయాలి…ఏఐవైఎఫ్

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఈనెల 25న చాబాల గ్రామానికి సంబంధించిన రాజేష్ సరిత దంపతుల కుమారుడు అహారుణ్ కుమార్ మృతికి కారణమైన వైద్యులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కావలి కొట్రేష్ తెలిపారు. సోమవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాలుడి ఆరోగ్యం పరిశీలించి తక్షణమే వైద్యాన్ని అందించాల్సిన. వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యం వహించి బాలుడి మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. వైద్యులు చేసిన నిర్లక్ష్యానికి కేవలం నర్సుని మాత్రమే సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వైద్యులను కూడా సస్పెండ్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యాలను డాక్టర్లు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విడపనకల్లు మండలం కొట్టాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా డాక్టర్లు విధుల్లో ఉండకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇలాంటి వారి పట్ల కూడా జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఉరవకొండ మండల కార్యదర్శి నవీన్ కుమార్ నాయకులు రామాంజి,మంజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు