Homeఆంధ్రప్రదేశ్ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి రూ.15వేలు విడుదల..

ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి రూ.15వేలు విడుదల..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించి, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ. 15,000 ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌లు పాల్గొన్నారు.. ఉండవల్లి నుంచి సింగ్‌నగర్‌కు ఆటోలో వెళ్లారు. ఈ పథకం కింద ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ. 15,000 ఆర్థిక సాయం డబ్బుల్ని విడుదల చేశారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారా లోకేశ్ చంద్రబాబు, పవన్, మాధవ్‌లకు మంగళగిరి చేనేత కండువాలను కప్పి లోకేశ్ స్వాగతించారు. కూటమి నాయకులకు మద్దతుగా మంగళగిరి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంగళగిరి యువత బాణసంచా కాల్చి, తీన్‌మార్ డప్పులతో సందడి చేశారు.

స్టేటస్ చెక్ చేస్కోండి, ఒకవేళ రాకపోతే ఇలా చేయండి

ఈ పథకంలో మీ పేరు ఉందో లేదో ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం లాగిన్ అవసరం లేదు.. డ్రైవర్లు తమ ఆధార్ కార్డ్ నంబర్‌తో పథకం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒక ప్రత్యేక లింక్ ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంది. ఆటో డ్రైవర్లు తమ పథకం స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకవేళ ఎవరికైనా ఆటో డ్రైవర్లకు డబ్బులు రాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అవసరమైన డాక్యుమెంట్లతో దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. అలాగే లిస్ట్‌లో పేరు లేకపోయినా గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆ లింక్ ద్వారా ఈ వివరాలు చూడవచ్చు. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే పథకం స్టేటస్, జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుస్తుంది. లింక్.. https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు