ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభంలో మంత్రి నారా లోకేష్
ఆటో డ్రైవర్‌ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్న వారిని 11కి దించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. డ్రైవర్‌గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్‌లు కూడా నటించారని గుర్తుచేశారు. ఎప్పుడు ఆటో వెనుక ఉన్న కొటేషన్లు నేను చదువుతాను అని చెప్పారు.ఆటోలో బ్యాగ్ మర్చిపోతే ఆటోడ్రైవర్‌లు వాటిని జాగ్రత్తగా పోలీసులకు అప్పగిస్తారన్నారు.యువగళం అప్పుడు ఆటో డ్రైవర్‌లతో ప్రత్యేకంగా మాట్లాడానన్నారు. కుడిచేత్తో రూ.10 వేలు ఇచ్చి ఎడమ చేత్తో రూ.20 వేలు గ్రీన్ టాక్స్ రూపంలో లాగేశారని మండిపడ్డారు. గుంతలు లేకుండా చూడడం ద్వారా ఆటో ప్రమాదాలు నివారించామన్నారు. ఆటో చార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసి వారికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని.. మహిళలను కించపరిచేలా రోజా మాట్లాడారని… దానిపై హమీద్ భాషా రోజా వద్దకు వెళ్లాలనుకున్నారని.. అయితే ఆయన ఆటోను పోలీసులు సీజ్ చేశారని తెలిపారు. ఆయన్ను ఆదుకోవాలని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు.పేదవాడి కారు ఆటో… చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేది ఆటోలోనే బస్సు, రైలు ఎక్కాలన్నా ఆటోలు ఉండాల్సిందే అని తెలిపారు. కార్మికులు డ్రైవర్లు తమ వాహనాలకు పూజ చేస్తారన్నారు. దసరా పండగ అయిన 3 రోజుల్లోనే ఆటో డ్రైవర్ల అకౌంట్‌లలో రూ.15 వేలు అందజేస్తున్నామన్నారు. సుమారు 3 లక్షల మందికి ఇస్తున్నామని.. మెరుగైన సర్వీసు అందజేయాలి అప్పుడే మంచి మార్కెట్ వస్తుందని చెప్పారు. ఆవకాయ పట్టాలన్న, అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా ఆటో నడపాలన్నా ఆడవారి తరువాతే మా అక్క స్వర్ణలత ఆటోను చాలా అద్భుతంగా తోలారు. భార్య, భర్త ఇద్దరూ ఆటోలు నడుపుతున్నారు. తల్లికి వందనం.. గ్యాస్ సిలెండర్ అందింది.. అత్తకు పెన్షన్ వస్తుంది అని చెప్పారు. ఆటో డ్రైవర్లను అడుగుతున్నాం మహిళలను మనం కించపరచకూడదు… గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, ఆడపిల్లలా ఏడవద్దు అనే మాటలు మనం వాడకూడదు. ఆటోలు ఎక్కేవారికి చెప్పండి మహిళలను గౌరవించండి అని. గత పాలకులు మీటింగ్‌కు రావడానికి పరదాలు కట్టేవారు, చెట్లు కొట్టేవారు. అయితే ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం కూడా మీ ముందు సామాన్యులుగా నిల్చుని ఉంటున్నారు. మనది డబల్ ఇంజన్ సర్కార్. అందుకే అన్ని పధకాలు నడపగలుగుతున్నాం అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఆటో వెనుక ఉన్న కొటేషన్లు నేను చదువుతాను :
- Advertisement -
RELATED ARTICLES


