Homeజిల్లాలువిజయనగరంరాజాంలో వైసీపీ ధర్నా – వైన్‌షాపుల కేటాయింపులో అక్రమాలపై నిరసన

రాజాంలో వైసీపీ ధర్నా – వైన్‌షాపుల కేటాయింపులో అక్రమాలపై నిరసన

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సోమవారం వైసీపీ రాజాం ఇంచార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. వైన్‌షాప్‌ల కేటాయింపులో చోటుచేసుకున్న అక్రమాలను గుర్తించి, అర్హతలేని వారికి ఇచ్చిన లైసెన్సులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, ప్రజల అభ్యంతరాలను పక్కనబెట్టి పాఠశాలలు, దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల పక్కన ఏర్పాటుచేసిన వైన్‌షాప్‌లు, బార్ల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖను ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. మద్యం విక్రయ వేళలను తగ్గించాలని కూడా ఆయన స్పష్టం చేశారు.ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అన్యాయంగా జరుగుతున్న లైసెన్సు కేటాయింపులపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు డిమాండ్ చేశారు.ధర్నాలో అనేకమంది వైసీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలతో ఎక్సైజ్ అధికారులను ఉద్దేశించి తీవ్ర నిరసన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు