విశాలాంధ్ర – నర్సీపట్నం రూరల్ : విద్యతోనే బాలికలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ జీ.ఇవి రమణ పేర్కొన్నారు. మండలం పరిధిలోని వేములపూడి గ్రామంలో జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని , బాలికల రక్షణను మన అందరి బాధ్యతగా భావించాలన్నారు. విద్యార్థినులు ఉన్నత చదువుల్లో పోటీపడాలని పిలుపునిచ్చారు.
బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు , బాలికల సంరక్షణ హక్కులు తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పించారు . అనంతరం బాలికలకు వ్యాసరచన పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు అప్పలనసమ్మ ,రామలక్ష్మి అంగన్వాడి టీచర్లు జ్యోతి , రేవతి, దేవుడమ్మ , సరోజిని తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే సమాజాభివృద్ధి .. సిడిపిఓ రమణ
- Advertisement -


