- Advertisement -
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: తిమ్మమ్మ మర్రిమాను మహా వృక్షాన్ని పివికెకె పీజీ వృక్షశాస్త్రం విద్యార్థులు సందర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వటవృక్షం (బన్యాన్ ట్రీ) తిమ్మమ్మ మర్రిమాను ఐదు ఎకరాలలో విస్తరించి ఉండటం.. ప్రకృతి సంపద, జీవ వైవిధ్యాన్ని పరిశీలించడం, పరిశోదాత్మకంగా అధ్యాయం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు, వారసత్వ సంరక్షణను, వాస్తవిక అన్వేషణ, పర్యావరణ విలువలను పెంపొందించుకునేందుకు విద్యార్థుల ఉజ్వల భవితకు తోడ్పాటున అందిస్తుందని అధ్యాపకుడు డా. పుల్లన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


