Homeజిల్లాలుఅనంతపురంజీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి..

జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి..

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి, వినియోగదారుల వృద్ధికి తోడ్పాటున అందిస్తుందని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కామర్స్ అధ్యాపకురాలు బి. షర్మిల రామయ్య పేర్కొన్నారు. పి వి కె కె పీజీ కళాశాలలోని సెమినార్ హాల్లో జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ పై అవగాహన సదస్సును కళాశాల ప్రిన్సిపల్ డా . వై మునికృష్ణారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్రప్రసాద్, కామర్స్ విభాగాధిపతి జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో సవాళ్లు, జీఎస్టీ స్లాబులు, కామర్స్ రంగంలో ఉన్న ఉజ్వల్ అవకాశాలను ఎలా కైవసం చేసుకోవాలో అంశాలను క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు టి. హరీష్, ఎకనామిక్స్ విభాగ్యపతి బి. దుర్గాప్రసాద్, మ్యాథమెటిక్స్ విభాగధిపతి పి. షేక్షావలి, ఫిజిక్స్ లెక్చరర్ వి. భువనేశ్వరి, కెమిస్ట్రీ లెక్చరర్ పి .ప్రత్యూష, ఇంగ్లీష్ లెక్చరర్ ఏ. వాణి, కెమిస్ట్రీ ల్యాబ్ అసిస్టెంట్ సూపర్వైజర్ జె వెంకటరమణ, సిస్టం అడ్మిన్ ఏం విజయ్ కుమార్, క్లర్కు మురళీమోహన్, లైబ్రరీన్ సురేష్ బాబు, అలిపిరా, జే .ముత్యాలప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు