విశాలాంధ్ర పెనుగొండ… మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం పెనుకొండ మున్సిపల్ కార్యాలయం ముందు ఎఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు 2023లో మున్సిపల్ కార్మికులకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కారుణ్య నియామకాలను వెంటనే అమలు చేయాలని, రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని, డైలీ వేజ్ కింద పని చేస్తున్న కార్మికులను అవుట్సోర్సింగ్ కింద తీసుకోవాలని, థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేయాలని, ఐఆర్, పీఆర్సీ,ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైన ప్రభుత్వం స్పందించాలని లేకుంటే నవంబర్ 3 న సమ్మె కు దిగుతామని ఆయన హెచ్చరించారు, కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కరణ్, మహేష్, వినోద్, బావక్క, గజేంద్ర, నరసింహులు, శాంతమ్మ, కార్మికులు పాల్గొన్నారు
మున్సిపల్ కార్మికుల సమస్యల పై ఎఐటియుసి ధర్నా…
- Advertisement -
RELATED ARTICLES


