మండలంలో ఉన్న ప్రజలందరికీ తుఫాన్ హెచ్చరిక
ఎస్సై పవన్ కుమార్
విశాలాంధ్ర – గోకవరం : గోకవరం పోలీస్ వారి విన్నపం తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంవల్ల అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని అందరూ జాగ్రత్తగా ఉండాలని మీరు మీ గృహల్లోనే ఉండవలెను సాయంత్రం 7గంటలు తరువాత ఎవరు రోడ్ మీదకు రావొద్దు 7గంటలు దాటిన తరువాత రోడ్ల మీద ఎటువంటి వాహనములు అనుమతించబడవు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాహనములు అనుమతించబడతాయి. దయచేసి ముసలి వాళ్ళని పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపరాదు వర్షం గాలి వచ్చేటప్పుడు చెట్ల కింద గాని కరెంటు స్తంభాలు వద్ద నిలవరాదు మీ కుటుంబ సభ్యులతోనే మీ గృహంలో ఉండాలని తుఫాన్ వల్ల ప్రమాదం జరిగేలా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించాలని తక్షణమే మీకు అందుబాటులో ఉంటామని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
తుఫాన్ హెచ్చరిక
- Advertisement -
RELATED ARTICLES


