Homeఆంధ్రప్రదేశ్నేనున్నాను ! ఎమ్మెల్యే బత్తుల

నేనున్నాను ! ఎమ్మెల్యే బత్తుల

- Advertisement -

తుఫాన్ వల్ల ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నాను ! ఎమ్మెల్యే బత్తుల

విశాలాంధ్ర – కోరుకొండ : కోరుకొండ మండలం లో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాజానగరం ఎమ్మెల్యే, బత్తుల బలరామకృష్ణ సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బలరామకృష్ణ పర్యటించారు. లోతట్టు ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు ఆదేశాలు సూచనలు అందించారు. గర్భిణీలను, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఎమ్మెల్యే బలరామకృష్ణ అధికారులను ఆదేశించారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పునరావాస కేంద్రంలో ఉన్న వారితో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ ఏ ఒక్కరూ అధైర్య పడవద్దని.. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలందరికీ ఏ విధమైన కష్టం వచ్చినా.. తాను అందుబాటులో ఉంటానన్నారు. తుఫాన్ వల్ల కష్టం వచ్చిందని అధైర్య పడవద్దని, ఏసమయంలోనైనా అందుబాటులో ఉంటామని ధైర్యం అందించారు. తుపాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం నూరు శాతం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు పకడ్బందీ ఏర్పాటు చేయాలని, భోజనం, అల్పాహారం రుచికరంగా ఉండేలా చూడాలన్నారు. బాధితులకు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వారిని తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలనీ అధికారులకు సూచించారు. . మరో రెండు,మూడు రోజులపాటు వర్షాలు ఉన్నందున అవసరమైతే తప్ప బయట ప్రయాణాలు చేయవద్దని ఎమ్మెల్యే బలరామకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో రోడ్లు పూర్తిగా మునిగిపోయి ఉన్నాయని, వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు