Homeఆంధ్రప్రదేశ్గిరజాల ఆగ్రహం

గిరజాల ఆగ్రహం

- Advertisement -

రైతులకు పంటభీమా కట్టకపోవడంపై గిరజాల ఆగ్రహం.

విశాలాంధ్ర – కడియం : ముంథా తుఫాన్ తో రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లుతోందని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు (బాబు) పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు, ముంథా తుఫాన్ కి కడియం ఆవలో నేల వాలిన వరి పంట పొలాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వాతావరణ పరిశోధనా సంస్థ ఈ ఏడాది పెద్ద తుఫాన్లు ఉన్నాయని ఎప్పటినుంచో హెచ్చరిస్తోందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ మాటలను పెడచెవిని పెట్టి రైతులకు భీమా చెల్లించ లేదన్నారు. రైతులకు ప్రభుత్వం ఉచిత పంట బీమా చెల్లించి ఉంటే ఈ రోజున వారికి 100% పంట నష్టం వచ్చివుండేది కాదని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం పంటలు పాక్షికంగా దెబ్బతిన్నా  ఉచిత పంటల భీమా ద్వారా వారికి తగిన రీతిలో పంట నష్టాలను చెల్లించామన్నారు. ఇవాళ ప్రభుత్వం పంటలకు బీమా కట్టకపోవడంతో రైతులకు భరోసా లేక అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ అనంతరం పంట దెబ్బతిన్న రైతులందరికీ నూరు శాతం పంట నష్టపరిహారం అందించకపోతే తీవ్ర స్థాయిలో పార్టీ తరఫునుంచి ఉద్యమం చేస్తామన్నారు. ప్రచార ఆర్బాటం తప్ప, తుఫానుని ఎదుర్కోవటానికి ఎక్కడా సరైన చర్యలు తీసుకోవట్లేదని ఆయన తీవ్రంగా దుయ్యపట్టారు. తక్షణం ఎవరికైనా అపాయం సంభవిస్తే కడియం మండలంలో ఎక్కడా 108 అంబులెన్స్ అందుబాటులో లేదని, 13 గ్రామాలకి ఉపయోగపడే మండల కేంద్రంలో గత 15 రోజులుగా అంబులెన్స్ లేకపోవడం ప్రజల పట్ల వారికి ఉండే ఉదాసీన వైఖరి కనిపిస్తోందన్నారు. ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే ఉచిత వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ సేవలు కూడా లేకపోవటం దురదృష్టమన్నారు. ప్రచారం తప్ప ప్రజల భద్రత విషయంలో ఎక్కడా జాగ్రత్త కనిపించట్లేదని పేర్కొన్నారు. కడియం బాలల ఆనంద వేదిక పార్కులో మంగళవారం సాయంత్రం ఆడుకుంటున్న సుమారు 20 మంది బాలలను తుఫాన్ హెచ్చరిక గురించి చెప్పి, వారిని భద్రంగా ఇంటికి పంపించేశారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఇంటి వద్ద సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో రైతు వంగపండు ప్రసాద్, పున్నమి రాజు వీర్రాజు, మలకల దోరబాబు, రావిపాటి శ్రీను, రైతులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు